ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చుపై ప్రత్యేక నిఘా ఉంచాలి


Wed,April 24, 2019 11:42 PM

మెదక్ కలెక్టరేట్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ధర్మారెడ్డి సహాయ వ్యయ పరిశీలకులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో సహాయ వ్యయ పరిశీలకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిధి దాటి ఖర్చు చేసిన గ్రామ పంచాయతీలు లేవా అని ప్రశ్నించారు. 469 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిమితి దాటినట్లు తమ దృష్టికి రాకపోవడం ఏమిటన్నారు. ఈ సారి జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వ్యయ పరిమితిని పక్కాగా పరిశీలించాలన్నారు. జీడ్పీటీసీ ఎన్నికల ప్రచార ఖర్చు రూ.4లక్షలు కగా, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార ఖర్చు రూ.1.5లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ధారించడం జరిగిందన్నారు. సహాయ వ్యయ పరిశీలకులు ఈ విషయంలో పక్కాగా ఉండాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎక్కువ ఖర్చు చేసే వారి వివరాలను సేకరించి పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి లక్ష్మీబాయి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు పరశురాం, నోడల్ అధికారి రాజిరెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రత్నాకర్‌తో పాటు సహాయ వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...