గ్రామాల అభివృద్ధికి కార్యదర్శులదే కీలకపాత్ర


Wed,April 24, 2019 11:42 PM

చేగుంట : గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులదే కిలక పాత్ర అని, వచ్చే వానకాలంలో ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యమని మండల ప్రత్యేక అధికారి జయరాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో ఉమాదేవి అధ్యక్షతన నూతనంగా విధుల్లో చేరిన చేగుంట, నార్సింగి మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ నిధులు, విధులు, పాలన పరంగా తీసుకునే పలు అంశాలను వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించి, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా పనిచేయాలని, గ్రామంలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను కట్టుకునే విధంగా ప్రోత్సహించాలని, వీధి దీపాలను ఏర్పాటు చేసి గ్రామాలను పచ్ఛదనం పరిశుభ్రత వాతవరణంలో ఉండే విధంగా చుడాలని సూచించారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నందున విధులను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని జయరాజ్ సూచించారు. కార్యక్రమంలో నార్సింగి మండల ప్రత్యేక అధికారి వసుందరరావు, ఎంపీడీవో ఉమాదేవి, వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...