తోలివిడుతకు నేటితో ఆఖరు


Wed,April 24, 2019 12:19 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :మొడటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు బుదవారంతో ముగియనున్నది. తొలి విడుత 6 మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పాపన్నపేట, హవేళిఘనపూర్, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్ మండలాల్లో 65 ఎంపీటీసీ, 6 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో ఆశావహులు బీపామ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీపామ్ లు దక్కించుకునేందుకు ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కడుతుండటంతో ఎంపిక చేయడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పాపన్నపేటకు ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. హవేళి ఘనపూర్ మండలానికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడుతలో హవేళిఘనపూర్, పాపన్నపేట మండలాలు మెదక్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలు అందోల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.

అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో పెద్దశంకరంపేట మండలం ఉంది. అక్కడి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక బాధ్యత స్థానిక ఎమ్యెల్యేలకే అప్పజెప్పడంతో సంబంధిత ఎమ్మెల్యేల చుట్టూ బీపామ్‌ల కోసం తిరుగుతున్నారు. గెలిచే అభ్యర్థుల కోసం ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగనుండటంతో పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది. పార్టీలన్నీ స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలోని జెడ్పీపీటంతో పాటు మండలాల్లో ఎంపీపీ పదవులన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకి రావాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల వద్ద ఆశావహుల సందడి మొదలైంది. ఇటీవల ఇతర పార్టీల నుంచి చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. అభ్యర్థుల తుది జాబితాను ఎమ్మెల్యేలు ప్రకటించనున్నారు.

జనరల్ స్థానాల్లో పోటాపోటీ...
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురాలని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. మండల స్థాయి పదవులపై ఆశలు పెట్టుకున్నవారికి రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఆయా స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జనరల్ స్థానాల్లో టికెట్ కోసం పోటాపోటీ కొనసాగుతున్నది. మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట, హవేళిఘనపూర్ మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానాల్లో ఓసీ అన్ (రిజర్వు) కావడంతో పోటీ నెలకొంది. మెదక్ మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. హవేళిఘనపూర్ మండల జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా ఎంపీపీ జనరల్‌కు రిజర్వు అయింది. అల్లాదుర్గం జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా ఎంపీపీ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఈ స్థానాల్లో అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉంది.

222
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...