ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం


Wed,April 24, 2019 12:14 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: ఈ యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని డీఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం దుబ్బాక మండలంలో తిమ్మాపూర్, హబ్షీపూర్, రామక్కపేట, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో(గ్రామీణాభివృద్ధి) జిల్లా అధికారి గోపాల్‌రావు, అడిషనల్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు తమ పంటను దళారులకు విక్రయించి నష్టపోవద్దని వారు సూచించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని తెలిపారు. జిల్లాలో 163 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఐకేపీ ద్వారా 107 కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 56 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1770, సాధారణ రకానికి రూ.1750 గిట్టుబాటు ధర చెల్లిస్తున్నదన్నారు. ఇందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ దుబ్బాక ఏపీఎం బాపూరావు, సీసీలు పరశురాములు, ఆనంద్ తదితరులు ఉన్నారు.

తొగుట: మండల కేంద్రమైన తొగుట వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ-గ్రేడ్ ధాన్యం రూ.1770, గ్రేడ్-బి ధాన్యంకు రూ. 1750 మద్దతు ధర ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీవో మనోజ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, సొసైటీ సీఈవో గంగారెడ్డి, మార్కెట్ కమిటీ డీఈవో సునీల్, రేషన్ డీలర్ భాస్కర్‌రెడ్డి, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...