బాధిత చేనేత కుటుంబానికి ఎమ్మెల్యే అండ


Wed,April 24, 2019 12:13 AM

దుబ్బాక టౌన్: పట్టణంలోని బాధిత చేనేత కుటుంబానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అండగా నిలిచారు. పట్టణానికి చెందిన తుమ్మ చంద్రమౌళి, శ్యామల దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కూతురు, కొడుకు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. చంద్రమౌళి పక్షవాతానికి గురై కుటుంబం కడు దయనీయ పరిస్థితి ఏర్పడింది. అప్పటికే చిన్న కూతురు భవ్యకు వివాహం కుదరటం పెండ్లి సమయం దగ్గరపడటంతో భార్య శ్యామలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. భవ్య వివాహానికి ఆర్థిక సహాయం, క్వింటా బియ్యంతో పాటు రెండు రోజుల పాటు కల్యాణ మండపంను ఉచితంగా వినియోగించుకునేందుకు మంగళవారం ఎమ్మెల్యే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు రొట్టె రమేశ్, కొట్టె ఇందిర, ఆసస్వామి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...