కొల్చారం మండలం జిల్లాలోనే ఆదర్శం కావాలి


Wed,April 24, 2019 12:13 AM

కొల్చారం : ఎంపీటీసీ ఎన్నికల్లో పదికి పది స్థానాలతో పాటు జెడ్పీటీసీని అత్యధిక మెజార్టీతో గెలిపించి జిల్లాలోనే కొల్చారం మండలం ఆదర్శంగా నిలువాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి చౌరస్తాలోని హనుమమ్మ గార్డెన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దేవన్నగారి శేఖర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ పటిష్టంగా ఉందన్నారు. మాజీ మంత్రి సునీతారెడ్డి రాకతో టీఆర్‌ఎస్ పార్టీ మరింత పటిష్టవంతంగా తయారైందన్నారు. కొల్చారం మండలంలో ముఖ్యులు జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీపీ అరిగె రమేశ్‌తో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీల రాకతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోగా, టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని విధంగా తయారైందన్నారు. అందరు సమిష్టిగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుని రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. ఒకవేళ ప్రజాసేవ చేయాలనుకునేవారికి అవకాశం రాకుంటే నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్ కంచుకోటగా కొల్చారాన్ని మార్చాలి...
- మాజీ మంత్రి సునీతారెడ్డి
గతంలో కొల్చారం మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేదని, ఇప్పుడు టీఆర్‌ఎస్ కంచుకోటగా మార్చాలని మాజీ మంత్రి సునీతారెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. కొత్త, పాత విబేధాలు వద్దని, ఎంపీటీసీ అభ్యర్థుల విషయంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ మల్లారెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సావిత్రిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ భూపాల్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, మాజీ అధ్యక్షుడు గౌరిశంకర్, మాజీ అధ్యక్షుడు కొమ్ముల యాదాగౌడ్, టెస్కో డైరెక్డర్ అరిగె రమేశ్, ఆయా గ్రామాల సర్పంచులు గోదావరి, రాంరెడ్డి, కరెంటు రాజాగౌడ్, ముత్యంగారి సంతోశ్‌కుమార్, నాగరాణి నర్సింలు, చలం ఝాన్సీలక్ష్మీయాదగిరి, సత్యనారాయణగౌడ్, దమ్మన్నగారి వీరారెడ్డి, రమేశ్, శ్రీశైలం, ఏడుపాయల డైరెక్టర్లు గౌరిశంకర్, మంద నాగులు, ఏఎంసీ డైరెక్టర్లు నాగేశ్వర్‌రావు, తలారి దుర్గేశ్, ఎంపీటీసీలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు వేమారెడ్డి, బాగారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, పోచయ్య, సుదర్శన్, మౌలానాసాబ్, హరిచంద్ తదితరులు పాల్గొన్నారు.
పైతర, చిన్నాఘన్‌పూర్ ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు..
మండలంలో పది ఎంపీటీసీ స్థానాలకు గాను పైతర, చిన్నాఘన్‌పూర్ ఎంపీటీసీ అభ్యర్థులు ఖరారయ్యారు. పైతర ఎంపీటీసీ అభ్యర్థిగా ఆరట్ల ఎల్లయ్య, చిన్నాఘన్‌పూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా ఎరుకల పెంటమ్మరత్నయ్యల అభ్యర్థిత్వాలను ఆయా గ్రామాల టీఆర్‌ఎస్ శ్రేణుల సమక్షంలో ఖరారు చేశారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...