భూ సమస్యల పరిష్కారానికి చర్యలు


Wed,April 24, 2019 12:12 AM

పెద్దశంకరంపేట : జిల్లావ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జేసీ నగేశ్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో 2లక్షల 60వేల పట్టాపాసుబుక్కులకు గాను 2లక్షల పాసుబుక్కులు అందించామన్నారు. మిగతావాటిలో ఫారెస్ట్, ఇతర సమస్యల వల్ల పట్టాపాసుబుక్కులు రాలేదన్నారు. మండలంలో 13672 రైతు ఖాతాలున్నాయని, ఇందులో 12032 ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయని, మరో 1640 ఖాతాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. దీనిలో 400 వరకు ఫౌతికి సంబంధించి మరో 400 సవరణ చేయాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వీఆర్వోలు వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 70వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు కోసం ఇప్పటికే సుమారు 100 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 20 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జేసీ వెంట తహసీల్దార్ కిష్టానాయక్, ఆర్‌ఐ దశరథ్, వీఆర్వోలు రమేశ్, సంగయ్య తదితరులు ఉన్నారు.
రేగోడ్ తహసీల్దార్ కార్యాలయం తనిఖీ..
రేగోడ్ : జేసీ నగేశ్ రేగోడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. పలు భూరికార్డులను పరిశీలించి, భూ రికార్డుల ప్రక్షాళన వివరాలను తెలుసుకున్నారు. జేసీ వెంట తహసీల్దార్ హేమామాలిని, సిబ్బంది ఉన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...