అందరికీ న్యాయం చేస్తాం


Tue,April 23, 2019 12:17 AM

మెదక్ ప్రతినిధి నమస్తే తెలంగాణ : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో జరిగిన భూ బాగోతంపై నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే, జేసీ నగేశ్ ఈ నెల 18న గ్రామానికి వెళ్లి విచారణ జరిపి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో గ్రామానికి వెళ్లి సందర్శించారు. సర్వే నంబర్. 73,74 పహాణీలో 22 మంది రైతు కుటుంబాల వారసులు ఉన్నారని వారికి తగిన న్యాయం చేస్తామని జేసీ తెలిపారు. అయితే రెండు రోజులుగా స్థానిక కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఆర్‌ఐని కలిసిన పని కావడం లేదని రైతులు మూకుమ్మడిగా సోమవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జేసీ నగేశ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెల్లకాగితాలపై రెవెన్యూ సిబ్బంది సంతకాలు పెట్టమంటున్నారని, ఆర్‌ఐ దగ్గరకి వెళితే తహసీల్దార్ వద్దకు వెళ్లాలని, తహసీల్దార్ వద్దకు వెళ్లి ఆర్‌ఐ దగ్గరకు వెళ్లాలని సలహాలు ఇస్తున్నారని జేసీ నగేశ్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. దేవులపల్లి గ్రామానికి చెందిన 22 మంది రైతు కుటుంబాల వారసులు మాసుల రామయ్య సర్వే నంబర్. 73, 74 పహాణీలో ఉన్నారని, పొజిషన్‌లో రైతులే ఉన్నారని, తప్పకుండా న్యాయంగా మీకే ఈ భూమి చెందుతుందని ఆర్డీవోకు ఓఆర్‌సీకి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు మరోసారి జేసీ నగేశ్ సూచించారు.

త్వరలో పట్టాలు సంబంధిత రైతులకే అందిజేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇతరులకు భూమిని రిజిస్ర్టేషన్ చేయకుండా సంబంధిత సబ్ రిజిస్ట్రారుకు లేఖ రాయాలని తహసీల్దార్‌ను ఆదేశించిన విషయాన్ని రైతులకు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పకుండా రైతులకే పట్టా సర్టిపికెట్లను అందజేస్తారని జేసీ రైతులకు చెప్పారు. రైతులకు కావల్సిన సర్టిఫికెట్లు అందజేస్తామని ఎవరు కూడా తెల్లకాగితాలపై సంతకాలు పెట్టవద్దని కాగితాలు పూర్తిగా చదివిన తరువాతనే సంతకాలు పెట్టాలని రైతులకు సూచించారు. ఇదిలా ఉండగా నర్సాపూర్ ఆర్డీవోకు, కౌడిపల్లి తహసీల్దార్‌కు జేసీ ఫోన్‌లో మాట్లాడారు. జేసీని కలిసిన వారిలో రైతులు మాసల కృష్ణ, మాసల అనిత, శశికళ, రమేశ్, యాదమ్మ, భారతి, లక్ష్మయ్య, శేకులు, రోజా రమణి, స్వామి. లక్ష్మణ్, రాములు తదితరులు ఉన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...