ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ


Tue,April 23, 2019 12:17 AM

మెదక్ అర్బన్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చందనదీప్తి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలోని పలు మండలాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. చట్టపరమైన విషయంలో న్యాయం జరుగకపోతే మళ్లీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి...

- పెద్దశంకరంపేటకు చెందిన కంచరి వీరయ్య మాట్లాడుతూ తనకు పెద్దశంకరంపేట బస్టాండ్ వద్ద తనకు స్థలం ఉన్నదని, ఇట్టి స్థలంలో 40 సంవత్సరాల నుంచి ప్రేమ్ వర్క్ షాపు కలదని, అదే గ్రామానికి చెందిన ఎం.డి సలీం కొందరు వ్యక్తులు వచ్చి ఆ స్థలం వారిదని గొడవకు దిగుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

- కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన సంతోష అదే గ్రామానికి చెందిన ఎం.డి యాదుల్‌తో 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నారని, కాని తన భర్త ఒక సంవత్సరం నుంచి తాగుడుకు బానిసై రోజూ కొడుతూ మరో అమ్మాయిని పెండ్లి చేసుకుని అన్యాయం చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ భర్తని బైండోవర్ చేసి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాలని కౌడిపల్లి ఎస్‌ఐని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...