సజావుగా మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష


Tue,April 23, 2019 12:17 AM

మెదక్ అర్బన్ : మైనార్టీ గురుకుల పాఠశాలలో 2019-20 సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి సోమవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రంలో 24 మంది విద్యార్థులకు గాను 13 మంది హాజరయ్యారు. 6వ తరగతిలో 15 సీట్లకుగాను 6 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 9మంది గైర్హాజరయ్యారు. 7వ తరగతిలో 7 సీట్లకుగాను 5 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. 8వ తరగతిలో 2 సీట్లకుగాను ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ నర్సింలు తెలిపారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి గంట ముందు నుంచే అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్దకు తమ తమ పిల్లల తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...