ఘనంగా బోనాల ఊరేగింపు


Tue,April 23, 2019 12:17 AM

మనూరు : మండల పరిధిలోని బాదల్‌గావ్‌లో సోమవారం బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచలింగేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా సోమవారం బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉదయం గ్రామస్తులు, మహిళలు గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అనంతరం ప్రతిష్ఠాపన చేయనున్న విగ్రహాలకు పూజాలు చేశారు. విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సప్తహా కార్యక్రమం కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...