ఏడుపాయల్లో భక్తుల సందడి


Mon,April 22, 2019 12:08 AM

పాపన్నపేట: పవ్రిత పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం భక్తులతో సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చి మంజీరానదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అమ్మవారి సన్నిధిలో గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చొని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఈవో మోహన్‌రెడ్డి పాలకవర్గ సభ్యులు ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు ఒడిబియ్యం కుంకుమార్చనలు తలనీలాలు, బోనాలు, సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి
ఆదివారం ఏడుపాయల దుర్గామాతను మాజీ మంత్రి సుద్దలదేవయ్య, సెక్రటరి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్ అధికారి రామస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఈవో మెహన్‌రెడ్డి వారికి ఆలయమర్యదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...