సీఎం కేసీఆర్ కార్మికవర్గ పక్షపాతి


Mon,April 22, 2019 12:08 AM

-కేసీఆర్ పరిపాలన, విధానాలను నిలబెట్టుకోవాలి
-రాబోయే కాలంలో కేసీఆర్‌తోనే కార్మికుల అభ్యున్నతి
-టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు
గజ్వేల్,నమస్తే తెలంగాణ/ గజ్వేల్‌రూరల్: సీఎం కేసీఆర్ కార్మికవర్గ పక్షపాతి అని టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌లు అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆదివారం టీఆర్‌ఎస్‌కేవీ ప్రథమ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా హాజరై వారు కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు సివిల్ సప్లయి హమాలీ కార్మికులంతా టీఆర్‌ఎస్‌కేవీ ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌కేవీలో చేరారు. ఈ సందర్భంగా అతిథులు ప్రసంగిస్తూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కార్మికులంతా ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల కష్టాలను ఉద్యమ సమయంలోనే గుర్తించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఒక్కో రంగంలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు గురించి కూడా గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌లకు వివరించడం జరిగిందని, సీఎం కేసీఆర్ కూడా గత సంవత్సరం బోర్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులకు సూచించారన్నారు.

రాష్ట్రంలో పక్క రాష్ర్టాలతో పోల్చుకుంటు సివిల్ సప్లయ్ హమాలీలకు 200శాతం కూలీ రేటు పెరిగిందన్నారు. గతంలో రూ.7లు చెల్లించిన కూలీని ప్రస్తుతం రూ.18రూపాయలుగా చెల్లిస్తున్నారన్నారు. ఏపీలో గత కూలీ రేట్లే కొనసాగుతున్నాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరితో పాటు హమాలీ కార్మికులకు కూడా ప్రమాదబీమా వర్తింప జేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.5లక్షల ప్రమాదబీమా అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఆటోలకు లైఫ్‌ట్యాక్స్‌ను రద్దు చేసి ఆటోకార్మికుల జీవితాలకు అండగా నిలిచారని,గతంలో ఎవ్వరూ పట్టించుకోని భవన నిర్మాణ రంగ కార్మికులకు రూ.7లక్షల ప్రమాదబీమాను సీఎం కేసీఆర్ ప్రారంభించి వారి జీవితాలకు బాసటగా మారారన్నారు. వైద్య,ఆరోగ్య శాఖ కార్మికులకు వేతనాలు పెంచి 100కోట్ల బడ్జెట్‌ను పెంచారని, ఇలా అన్ని రంగాల కార్మికులను అభివృద్ధి చేయడానికి సీఎం సంకల్పించారన్నారు. రూ.84కోట్ల లైఫ్‌ట్యాక్స్ భారాన్ని ఆటో కార్మికులకు తప్పించారన్నారు. సివిల్ సప్లయి కార్మికులు ఉమ్మడి జిల్లాలో 400ల మంది, రాష్ట్రంలో 5వేల మంది ఉన్నారని వారందరికీ టీఆర్‌ఎస్‌కేవీ అండగా ఉంటుందని, ఇక వారి భవిష్యత్ పూర్తిగా మారనుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కార్మిక సంఘం ఉండాలి
అనునిత్యం కష్టించే అన్ని రంగాల కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కార్మిక సంఘం ఉండాలని టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక సంక్షేమ విధానాలతో అన్ని సంఘాల నాయకులు, కార్మికులంతా టీఆర్‌ఎస్‌కేవీలో చేరిపోతున్నారన్నారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎజాజ్‌లు టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్రఅధ్యక్షుడు రాంబాబును శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ సిద్దిపేట జిల్లా గౌరవాధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్, ప్రధాన కార్యదర్శి పెర్క శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా సివిల్ సప్లయిహామాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు బి.రాజయ్య, కార్యదర్శి బాబుమియా, సిద్దిపేట, మెదక్ జిల్లాల అధ్యక్షకార్యదర్శులు పరశురాములు, శ్రీనివాస్, రవీందర్, సాయిలు, గజ్వేల్ బాధ్యులు సాజిద్, నాయకులు ఆసా, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...