మల్లన్నను దర్శించుకున్న భక్తులు


Mon,April 22, 2019 12:08 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు చేసిన మల్లన్న నామస్మరణలతో క్షేత్రం పులకరించింది. వేసవి సెలవులు కావడంతో సుమారు 20 వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ సెవెల్లి సంపత్, కమిటీ సభ్యులు ముత్యం నర్సింలు, జూకంటి కిష్టయ్య, ఆలయ ఏఈవో రావుల సుదర్శన్, పర్యవేక్షకులు నీల శేఖర్, సిబ్బంది బత్తిని పోచయ్య, మేకల పోచయ్య, ఏఈ బ్రహ్మండ్లపల్లి అంజయ్య, సార్ల విజయ్‌కుమార్, వెంకటచారి, వైరాగ్యం జగదీశ్వర్, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సార్ల కనకయ్య, మాధవి, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...