దుర్గమ్మా.. దీవించమ్మా


Mon,April 22, 2019 12:08 AM

- కనుల పండువగా ముగిసిన దుర్గమ్మ ఉత్సవాలు
- అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
బీబీనగర్ : మండల కేంద్రంలో దుర్గమ్మ పండుగ మహోత్సవాలు ఆదివారం కనుల పండువగా జరిగాయి. దుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీబీనగర్ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నానన్నారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేకు ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణమంతా అమ్మవారి నామస్మరణలతో మార్మోగింది. శనివారం అర్ధరాత్రి అమ్మవారికి బోనాలు సమర్పించి ఆదివారం ఉదయం దుర్గమ్మ తల్లికి ఒడి నింపి తమను చల్లగా చూడాలని వేడుకున్నారు. అనంతరం పట్టణ ప్రజలంతా అమ్మవారికి జంతు బలి సమర్పించుకొని కుటుంబ సమేతంగా వనభోజనాలకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పంజాల రామాంజనేయులు, జిల్లా నాయకులు కాసుల ఆంజనేయులు, గోళి నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, పి.శ్యామ్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొంతం లింగయ్యగౌడ్, ఎంపీటీసీ వెంకటేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగ అశోక్, మాజీ ఉపసర్పంచ్ అక్బర్, ప్రజాప్రతినిథులు, నాయకులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...