ఓట్ల లెక్కింపు కోసం కేంద్రాల పరిశీలన


Sat,April 20, 2019 11:45 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ ధర్మారెడ్డి పట్టణంలో పర్యటించారు. డివిజన్ కేంద్రం నర్సాపూర్ పట్టణంలో లెక్కించడం కోసం కేంద్రాలను ఎంపిక చేయడానికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌తో పాటు గిరిజన గురుకుల పాఠశాలను పరిశీలించారు. అనంతరం కౌడిపల్లి మండలంలోని తునికి బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్ర పరచడం కోసం స్ట్రాంగ్‌రూంలు, కౌటింగ్ చేసే కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు కోసం జెడ్పీ సీఈవో లక్ష్మీభాయి, డీపీవో హనోక్‌తో పాటు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం పలు సూచనలు చేశారు. గదులకు డోర్‌లు, పార్కింగ్ సౌకర్యం, ఇతర వసతుల ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో వామనరావు, ఈవోపీఆర్‌డీ నర్సింహారెడ్డి, ఏపీవో అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...