స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్


Sat,April 20, 2019 11:45 PM

కొల్చారం : కొల్చారంలోని సొషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో స్ట్రాంగ్‌రూంల ఏర్పాటు కోసం కలెక్టర్ ధర్మారెడ్డి శనివారం పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌తో కలిసి బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి గదులను, కౌంటింగ్ చేసేందుకు అవసరమైన హాల్‌లను పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లను పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు భద్రపరుచనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, తునికి రెసిడెన్షియల్ కళాశాలలో వసతి చూడటం జరిగిందని, మెదక్ డివిజన్‌కు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచేందుకు కొల్చారంలో వసతి చూడటం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీవో వామనరావు, ఆర్‌ఐ బోనాల రాము తదితరులు ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...