మే 2 నుంచి 8 జిల్లాల్లో వయోవృద్ధుల సేవా కేంద్రాలు


Sat,April 20, 2019 11:45 PM

తూప్రాన్ రూరల్ : రాష్ట్రంలోనే ఫైలట్ ప్రాజెక్టు కింద తూప్రాన్ 50 పడకల దవాఖానలో కొనసాగుతున్న వయోవృద్ధుల సంక్షేమ కేంద్రం తరహాలోనే కొత్తగా మరో 8 జిల్లాల్లో మే 2 నుంచి వయోవృద్ధుల సంక్షేమ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు (ఎన్‌పీహెచ్‌సీఈ) నేషనల్ ప్రోగ్రాం హెల్త్ కేర్ ఫర్‌ది ఎల్డర్లీ ప్రాజెక్టు రాష్ట కోఆర్డీనేటర్ జగన్నాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం తూప్రాన్‌లోని వయోవృద్ధుల కేంద్రాన్ని ఖమ్మం, వరంగల్,రంగారెడ్డి,మహబూబ్‌నగర్, జనగామా, యాదాద్రి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలోని వైద్య బృందం ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తూప్రాన్‌లో గతేడాది ఆగస్టులో ఎన్‌పీహెచ్‌సీఈ ఆధ్వర్యంలో హెల్పేజ్ ఆఫ్ ఇండియా, టాటాట్రస్టీలు సంయుక్తంగా ప్రారంభమైన వయోవృద్ధుల సంక్షేమ కేంద్రంలో వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.

ఫైలట్ ప్రాజెక్టు కింద తూప్రాన్‌లో కొనసాగుతున్న సేవలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ఇతర జిల్లాల్లో కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన గదులు, వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, వారికి రోజువారిగా అందించే వైద్య సేవలను వృద్ధులను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని ఘనపూర్‌లో కొనసాగుతున్న వయోవృద్ధుల ఆక్టివిటీ కేంద్రాన్ని పరిశీలించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా, కాలక్షేప కబుర్లతో ఉల్లాసం పొందుతున్నామన్నారు. అనంతరం వైద్య బృందం ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డీనేటర్ జగన్నాథరెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఫైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన తూప్రాన్ వయోవృద్ధుల సంక్షేమ కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అదే తరహాలోనే వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్, జనగామా, సిద్దిపేట, రంగారెడ్డి, ఖమ్మం, యాదాద్రి జిల్లాలో మే 2నుంచి వయోవృద్ధుల సేవా కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ దవాఖాన సూపరింటెండెంట్ అమర్‌సింగ్, హెల్పేజ్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు మేనేజర్ మోహన్, టాటాట్రస్టీ ప్రాజెక్టు మేనేజర్ కిష్టయ్య, సీహెచ్‌వో బాల్‌నర్సయ్య, డాక్టర్ భావన, వివిధ జిల్లాలకు చెందిన సూపరింటెండెంట్‌లు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...