ఏడు మండలాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురేస్తాం


Sat,April 20, 2019 11:44 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏడు మండలాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం మాజీ మంత్రి సునీతారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పనిచేసి అన్ని మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక...
అనంతరం చిలిపిచెడ్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంచెంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్యతో పాటు వార్డు సభ్యులు భారతి, సాగర్‌రెడ్డి, బాలకృష్ణ, చందర్, రాజులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్, పిట్ల సత్యనారాయణ, నాయకులు వెంకట్‌రెడ్డి, సత్యంగౌడ్, సూరారం నర్సింలు, నహీం, ఎంసీ విఠల్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...