ఘనంగా ఏడుపాయల్లో పల్లకీసేవ


Sat,April 20, 2019 12:16 AM

పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత క్షేత్రం దుర్గమ్మ నామస్మరణలతో మార్మోగింది. శుక్రవారం సాయంత్రం పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. ఆలయం నుంచి రాజగోపురం వరకు పల్లకిసేవ కనుల పండువగా కొనసాగింది. పాలక మండలి చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్దన్‌రెడ్డి, ఈవో మోహన్‌రెడ్డిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీసేవను ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో భక్తులు పల్లకీ సేవలో పాల్గ్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుందన్నారు. పల్లకీసేవలో పాల్గొనే వారు ముందస్తుగానే పల్లకీ సేవ టికెట్లు తీసుకుంటున్నారన్నారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు అమ్మవారు కోరుకున్న కోరికలు తీర్చుతారని అపార నమ్మకమన్నారు. ఈ సేవలో ధర్మకర్తలు నాగప్ప, శ్రీధర్, దుర్గయ్య, ప్రభు, నారాయణ, కిష్టయ్య, గౌరీశంకర్, నాగయ్యలతో పాటు ఆలయ సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్, మధుసూధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శ్రమ, విఠల్, మహేశ్‌లతో భక్తులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...