టార్గెట్ జూన్ 30..


Thu,April 18, 2019 11:31 PM

చిన్నకోడూరు : వేల కోట్ల రూపాయలు వ్యయంతో వ్యవసాయ రంగానికి సాగునీరు అందించాలనే గొప్ప సంకల్పం తో సీఎం కేసీఆర్ భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.. ఈ పనులన్నీ చరిత్రలో నిలిచిపోతాయి.. ప్రాజె క్టు పనుల్లో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావ డం ఎంతో అదృష్టమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇంతకన్న గొప్ప పని మరొకటి ఉండదన్నారు. గురువారం రాత్రి చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, పెద్దకోడూరు గ్రామ శివారులో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోని పల్లగుట్టపై ఉన్న ఎస్‌ఈ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 10, 11వ ప్యాకేజీ పనులపై ఈఎన్‌సీ హరిరామ్‌తో కలిసి ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎట్టి పరిస్థితుల్లో జూన్ 30 లోపు సర్జిపుల్ పంపుహౌస్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌ను కలిపే 300 మీటర్ల అప్రోచ్ కెనాల్ 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్యాకేజీ -10 అనంతగిరి రిజర్వాయర్ పెండింగ్ పనులపై అధికారులను ఆరా తీశారు. టన్నెల్‌లో మిగిలిపోయిన 110 మీటర్ల లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్జిపుల్ పనులను వేగవం తం చేసి మే చివరి నాటికి పూర్తి కావాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌ను కలిపే అప్రోచ్ కెనాల్‌ను వారం పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అందుకు కావాల్సిన పెం డింగ్‌లో భూసేకరణ త్వ రితగతిన పూర్తి చేసి పను లు ప్రారంభించాలని పేర్కొన్నారు. అనంతగిరి రిజర్వాయర్ పనులు జూన్ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్మా ణం వేగంగా పూర్తయితే చెరువులు, కుంటలను నింపుకునే వీలు ఉంటుందన్నారు. ఎడమ కాలువలో 56 కి.మీ మైనర్ కెనాల్స్ పూర్తి కావాలని, అందుకు సంబంధించిన ఎస్‌డీఆర్ అందజేయాలని అధికారులను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు.

రంగనాయకసాగర్ డెలివరీ సిస్టమ్... మే చివరి నాటికి పూర్తి చేయాలి
సొరంగం నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని పంపించే డెలివరీ సిస్టమ్‌ను మే చివరి నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రిబిట్‌మెంట్ పనులు పది రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రంగనాయకసాగర్ ప్రధాన కాలువలు, కుడి ఎడమ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కాలువల్లో మిగిలిన సీసీ లైనింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని గ్రామాల మీదుగా కాలువల నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలకు రాకపోకలకు వీలుగా ఉండే విధంగా నిర్మిస్తున్న కాలువలపై బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ పద్మాకర్, ఎస్‌ఈ ఆనంద్, ఈఈ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఈ ప్రసాద్, తహసీల్దార్ విజయ్, ఇరిగేషన్ అధికారి మహ్మద్‌ఖాజా, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, మెగా కంపెనీ ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్రం, సొసైటీ చైర్మన్లు కీసరి పాపయ్య, కోల రమేశ్‌గౌడ్, పాల సాయిరాం, దువ్వల మల్లయ్య, ఆంజనేయులు, మల్లేశం, నవీన్ తదితరులు ఉన్నారు.

ఆర్‌అండ్‌ఆర్ పనుల జాప్యంపై సమీక్ష
అనంతగిరి రిజర్వాయర్‌లో అల్లీపూర్, కొచ్చగుట్టపల్లి, ఎల్లాయిపల్లి గ్రామాల్లో కొన్ని ఇండ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్‌అండ్ ఆర్ పథకంలో 250 చదరపు గజాల స్థలంలో ఇండ్ల నిర్మాణా న్ని చేపట్టిందని హరీశ్‌రావు అన్నారు. అల్లీపూర్‌లో నిర్మిస్తు న్న ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. మెట్టుబండల సమీపం లో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాల జాప్యంపై ఆరా తీశారు.

189
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...