గ్రామాల్లో మరింత పరిపాలన సౌలభ్యం


Thu,April 18, 2019 11:30 PM

హవేళిఘణపూర్: గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీతో ధ్రువీకరణ పత్రాలు తదితర అవసరాలుంటే వారు ఎక్కడ ఉన్నారో వెతికి అక్కడికి వెళ్లి వారితో పనులు చేసుకోవడం... ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీలతోనే ఒకరొకరికి నాలుగైదు గ్రామాల చొప్పున ఇన్‌చార్జిలు ఇవ్వడంతో ఇటు అధికారుల, అటు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొనేవారు. వీటిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ 10మంది పంచాయతీ సెక్రటరీలు, హవేళిఘణపూర్ మండలంలో గతంలో 12 మంది పంచాయతీ సెక్రటరీలు ఉండగా, నూతనంగా 22 మంది పంచాయతీలకు సెక్రటరీలను నియామకం చేశారు. దీంతో పంచాయతీ సెక్రటరీలు బుధవారం గ్రామ పంచాయతీలకు వెళ్లి పూర్తి బాధ్యతలు కూడా స్వీకరించారు. మెదక్, హవేళిఘణపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సెక్రటరీలు లేక పన్నుల వసూళ్లు, ఇతరాత్ర అవసరాలకు పనుల ఒత్తిడితో అధికారులు, ప్రజలు కూడా అవస్థలు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా ఏవైనా ధ్రువపత్రాలు కావాలంటే గ్రామ పంచాయతీ సెక్రటరీలో వారానికొక రోజు ఒక గ్రామాన్ని కేటాయించి ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో విధులు నిర్వర్తించేవారు. దీంతో పన్నుల వసూళ్లు, గ్రామంలో రికార్డుల నిర్వహణ, సమావేశాలతో విధుల నిర్వహణ కష్టంగా ఉండేది. దాంతో ప్రజలకు పంచాయతీ సెక్రటరీలు ఎప్పుడు వస్తారనే వేచి చూసేవారు. కానీ ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పంచాయతీలకు సెక్రటరీలను నియమించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు, హవేళిఘణపూర్ మండలంలో 28 గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలు చేరగా ఇక గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం సులభతరం కానుంది. గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండి సేవలందించనుండడంతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించేందుకు వీలు ఏర్పడింది.

గతంలో గ్రామ పంచాయతీల్లో కొద్ది మంది మాత్రమే ఉన్న పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో శానిటేషన్, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు తదితర వాటిని చూసుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఒకే పంచాయతీ కార్యదర్శికి నాలుగైదు గ్రామాలు ఇన్‌చార్జిగా అప్పగించడంతో గ్రామాలకు వారం రోజులకోసారి మాత్రమే వెళ్లి పనులు నిర్వర్తించడం వల్ల రికార్డులు పూర్తి చేయడం నానా అవస్థలుండేవి. ముఖ్యంగా గ్రామాల్లో జనన, మరణాల రికార్డుల నిర్వహణ, ధ్రువపత్రాల అందజేతతో పాటు ఇటీవలే గ్రామ శివార్లలో నర్సరీల ద్వారా మొక్కలు పెంచి వాటిని నాటించి కాపాడే బాధ్యతను కూడా ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీలకు అప్పగించడంతో మరింత బాధ్యత పెరిగింది. అసలే కొద్దిమంది ఉన్న పంచాయతీ సెక్రటరీలతో గతంలో అంతంత మాత్రంగానే కొనసాగేవి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పంచాయతీ సెక్రటరీల నియామకంతో ఈ పనులు పూర్తి కానున్నాయి. పంచాయతీ సెక్రటరీలు వారికి కేటాయించిన గ్రామాల్లోకి వెళ్లి అక్కడే విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవలందించేందుకు మార్గం సుగమమైంది.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...