నిరాశపరిచిన ఇంటర్ ఫలితాలు


Thu,April 18, 2019 11:30 PM

మెదక్, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 29 శాతం, ద్వితీయ సంవత్సరంలో 34 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,886 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,723 మంది ఉతీర్ణులయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సూర్యప్రకాశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 7,028 మంది విద్యార్థులకు గాను 2,054 మంది ఉత్తీర్ణత(29 శాతం) సాధించారు. ఇందులో 3,211 మంది బాలురకు గాను 707 మంది(22 శాతం)ఉత్తీర్ణులు కాగా.. 3,817 మంది బాలికలకు గాను 1,347 మంది(35శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,780 మంది విద్యార్థులకు గాను 1,972 మంది ఉత్తీర్ణులు (34శాతం) కాగా.. బాలురు 2,626 మందికి గాను 670 మంది (25శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో గత సంవత్సరం మాదిరిగానే బాలికలదే హవా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 1,377 మంది బాలురు, 2,649 మంది బాలికలు ఉత్తీర్ణులైనట్లు నోడల్ అధికారి వెల్లడించారు.

ఒకేషనల్ విభాగంలో...
ఒకేషనలోఓ కోర్సులో ప్రథమ సంవత్సరంలో 624 మంది విద్యార్థులకు గాను 369 మంది(59 శాతం), ద్వితీయ సంవత్సరంలో 445 మంది విద్యార్థులకు గాను 328 మంది(72శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఉతీర్ణతలో వెనుకబడ్డ జిల్లా..
జిల్లాలో గత సంవత్సరం ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 42 శాతం, ద్వితీయ సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈసారి మరింత దిగజారి ఉత్తీర్ణత శాతం తగ్గడం విశేషం.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...