అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరువాలి


Wed,April 17, 2019 11:38 PM

మెదక్ కలెక్టరేట్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరువాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. బుధవారం తన చాంబర్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను రోజువారీగా తెలియజేయాలన్నారు. ఎన్నికల లో పోటీ చేసే అభ్యర్థుల పేరు రూరల్ ఓటర్ లిస్టులో నమోదై ఉండాలన్నారు. జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థి పేరు జిల్లాలో ఎక్కడ నమోదు అయినా పర్వాలేదు అన్నారు. ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థి పేరు ఆ మండలంలోని ఏగ్రామంలో అయినా నమోదు అయి ఉండాలన్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయని ఏ అభ్యర్థి అయితే పార్టీ బీ-ఫారం ఇస్తాడో అతడికి పార్టీ గుర్తు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు అనర్హులు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, టీడీపీ నాయకులు అప్జల్, డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్, నోడల్ అధికారి రాజిరెడ్డి, డీపీఆర్వో శైలేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...