ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ


Tue,April 16, 2019 11:32 PM

మెదక్ మున్సిపాలిటీ : ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ్ల ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరగకపోతే ఫిర్యాదుదారులు తిరిగి తనను సంప్రదించాలని అన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
*పెద్దశంకరంపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన పెద్ద రాంకిష్టయ్యకు సాయిలు, సంగప్ప, ఆంజనేయులు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి వివాహాలు ఘనంగా చేశాడు. రాంకిష్టయ్య భార్య బాగాలేకపోతే రూ.50వేలు అప్పు తెచ్చి దవాఖానలో చూపించాడు. అట్టి అప్పు డబ్బులను ముగ్గురు కుమారుల సమానంగా తండ్రికి ఇవ్వాలని గ్రామ పెద్దలు చెప్పారు. అదే విధంగా బతుకు దెరువు కోసం ముగ్గురు కుమారులు నెల నెలా ఒక్కొక్కరు రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రకారం పెద్ద, చిన్న కుమారుడు డబ్బులు ఇస్తుండగా రెండో కుమారుడు డబ్బులు ఇవ్వడం లేదని, ఊర్లో ఉన్న 100 గజాల ఇల్లును ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఈ విషయంలో గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా వినడంలేదు. తనకు తగిన న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ రోజు జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...