శ్రీనివాస్‌కు దళిత రత్న అవార్డు


Tue,April 16, 2019 11:32 PM

రామాయంపేట: నిజాంపేట మండల కేంద్రానికి చెందిన దళిత నాయకుడు గర్గుల శ్రీనివాస్‌కు దళిత రత్న అవార్డును అందజేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవంలో నిజాంపేట మండలానికి చెందిన గర్గుల శ్రీనివాస్‌ను ఎంపిక చేసి అందజేశారు. ఈ అవార్డును జా తీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కేశపాక రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ జన్ను కనకరాజుల చేతుల మీదుగా అందజేశారు. అవార్డును అందుకున్న గర్గుల శ్రీనివాస్ నిజాంపేట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. దళితరత్న అవార్డును అందుకోవడం చాలా సంతృప్తిగా ఉం దన్నారు. అవార్డు రావడం పట్ల తనకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. దళిత హక్కుల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. తన అ వార్డుకు సహకరించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును అందించిన వారి లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామలక్ష్మణ్, కరుణాకర్, హన్మంతునాయక్, ఎమ్మార్పీఎస్ జాతీయ అ ధ్యక్షుడు మేడి పాపయ్య, చెన్నయ్య ఉన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...