స్థానిక సమరానికి సన్నద్ధం


Tue,April 16, 2019 11:32 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్‌లో స్థానిక ఎన్నికల పోరుకు నాయకులు సమాయత్తం అవుతున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్ నియోజక వర్గంలో గల 6 మండలాలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు 64 ఎంపీటీసీలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. జడ్పీటీసీల్లో నాలుగు మహిళలకు, రెండు పురుషులకు కేటాయించగా, ఎంపీటీసీల్లో 30 మంది మహిళలు కాగా 34 మంది పురుషులకు రిజర్వేషన్ ఖరారైంది. నియోజక వర్గంలో గతంలో వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, గజ్వేల్, కొండపాక, తూప్రాన్ మండలాలు ఉండేవి. మండలాల పునర్విభజన తర్వాత మర్కూక్, మనోహరాబాద్ మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు మెదక్ జిల్లా పరిధిలోకి వెళ్లగా మిగితా 6 మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలలో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు ఉండవు కనుక మిగతా గ్రామాలను ఎంపీటీసీల పరిధి నిర్ణయించి, వాటికి జెడ్పీటీసీలకు ఎస్సీ, బీసీ, జనరల్‌గా సుమారు 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. గతంలో గజ్వేల్ ఎంపీపీ ఎస్సీ జనరల్, జెడ్పీటీసీ బీసీ జనరల్ కాగా వర్గల్ ఎంపీపీ బీసీ మహిళ జడ్పీటీసీ ఎస్సీ జనరల్, ములుగు ఎంపీపీ, జెడ్పీటీసీలు రెండు జనరల్, జగదేవ్‌పూర్ ఎంపీపీ బీసీ మహిళ జెడ్పీటీసీ బీసీ జనరల్ కొండపాక ఎంపీపీ బీసీ మహిళ జడ్‌పీటీసీ జనరల్ మహిళలు ఉన్నాయి.

మారిన రిజర్వేషన్లు: కొండపాక మండలంలో 14 ఎంపీటీసీలుండగా ములుగులో 10, గజ్వేల్‌లో 11, జగదేవ్‌పూర్‌లో11, మర్కూక్‌లో 7, వర్గల్‌లో11 ఎంపీటీసీలున్నాయి. ఇందు లో 34 మంది పురుషులు కాగా మరో 30 మంది మహిళలకు కేటాయించడం జరిగింది. గత రిజర్వేషన్లు పూర్తిగా మారాయి. గజ్వేల్ ఎంపీపీ ఎస్సీ మహిళ కాగా జెడ్పీటీసీ ఎస్సీ జనరల్‌ను కేటాయించారు. వర్గల్ ఎంపీపీ బీసీ మహిళ కాగా జడ్పీటీసీ బీసీ మహిళ, జగదేవ్‌పూర్ ఎంపీపీ జనరల్, జెడ్పీటీసీ జనరల్ మహిళ, ములుగు ఎంపీపీ జడ్పీటీసీలు రెండు బీసీ మహిళలు కొండపాక ఎంపీపీ బీసీ మహిళ, జెడ్పీటీసీ బీసీ మహిళ రిజర్వ్ అయ్యింది.
అభ్యర్థుల ఎంపికలో నాయకులు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మండలాలలో ముమ్మరమైంది. ఆయా పార్టీల నాయకత్వం గెలిచే అభ్యర్థులను గుర్తించి పార్టీ గుర్తులపై పోటీ ఉండటంతో సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. కాగా బీ ఫారమ్ కోసం అప్పుడే అభ్యర్థుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్షంగా మారడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీపీ అభ్యర్థులు పోటీలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని మండలాలలో ఎంపీపీ అభ్యర్థి కూడా ముందే గుర్తింపు పొంది పోటీలోకి దిగాలని భావిస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రికార్డు సృష్టించనున్న కేపీఆర్
ములుగు: ప్రస్తుతం భారతదేశానికి సీఎం కేసీఆర్‌లాంటి సమర్థుడైన నాయకుడు ప్రధానిగా రావాల్సిన అవసరం ఎంతో ఉందని టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి చెట్టి సురేశ్‌గౌడ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అనేక రాష్ర్టాలు సీఎం కేసీఆర్ పరిపాలన చూసి అభినందించి ఆయన ప్రజలకు అందించిన పథకాలను వారి రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అన్నారు.
వెల్లువెత్తిన అభిమానం

కొల్చారం: సోమవా రం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన హోం మంత్రి,మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ఎగ్గె మ ల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లను కొ ల్చారం మండల టీఆర్‌ఎస్ నాయకులు కలిసి అభి నందించారు. రాంపూర్ సర్పంచ్ రాంరెడ్డి తన పాల కవర్గంతో హైదరాబాద్‌కు వెళ్లి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెంట శాసనమండలికి వెళ్లారు. ఇటీవలనే ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు మల్లేశం, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డిలకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందిం చారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఎగ్గె మల్లేశంను కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాకె విఠల్, కొల్చారం కురుమ సంఘం అధ్యక్షుడు మాణెయ్య యాదవ్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...