కనుల పండువగా సీతారాముల కల్యాణం


Mon,April 15, 2019 12:23 AM

మెదక్, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణమహోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ దంపతులు, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు ఆర్కె శ్రీనివాస్, గడ్డమీద యశోధ, దొంతి లక్ష్మి, రాధ, జ్యోతి, చంద్రకళ పాల్గొన్నారు. స్వామి వారికి ఎమ్మెల్యే పట్టు వస్తాలు, తలంబ్రాలు సమర్పించగా.. మున్సిపల్ చైర్మన్ దంపతులు ఒడి బియ్యం పోశారు. కల్యాణ మహోత్సవంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చల్ల నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాచీన శివాలయం,
ఆనాది హనుమన్ ఆలయంలో..
జిల్లా కేంద్రంలోని బ్రహ్మణవీధిలోని ప్రాచీన శివాలయం, కుమ్మరిగడ్డలోని ఆనాది హనుమన్ ఆలయాల్లో సీతారాములు కల్యాణం ఆలయాల పురోహితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశానుగర్తలు వైద్య శ్రీనివాస్‌శర్మ, మణికంఠశర్మ, రాజమౌళి శర్మ, శ్రీవాండ్ల కృష్ణామూర్తి, మున్సిపల్ కౌన్సిలర్ అనూష అరవింద్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

ఐదు సంవత్సరాలుగా అన్నదానం..
ఐదు సంవత్సరాలుగా కోదండ రామాలయంలో భక్తులకు మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మజ్జిగ పంపిణీ...
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొదండ రామాలయంలో సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
రామాయంపేటలో..
రామాయంపేట రూరల్ : రాష్ట్రంలో అందరికి మంచి జరుగాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కోరుకున్నారు. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా మండల పరధిలోని తొనిగండ్ల హనుమాన్ దేవాలయంలో సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

పాపన్నపేటలో..
పాపన్నపేట, నమస్తే తెలంగాణ : మండలం కేంద్రంలోని సీతారామాలయంలోని కల్యాణమహోత్సవానికి ఏడుపాయల చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్దన్‌రెడ్డి దంపతులు హాజరై పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమానికి సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఏడుపాయల డైరెక్టర్ ప్రభుగౌడ్, జ్యోతి అంజిరెడ్డి, నాగప్ప, డీకోండ నారాయణతో పాటు పాపన్నపేట ఎస్సై అంజనేయులు హాజరయ్యారు. కాగా లక్ష్మీనగర్, చిత్రియాల్, గాజులగూడెం గ్రామాల్లో జరిగిన సీతారామకల్యాణంలో పాపన్నపేట మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పుల్లన్నగారి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో..
నర్సాపూర్, నమస్తే తెలంగాణ/నర్సాపూర్ రూరల్ : నర్సాపూర్ సమీపంలోని సీతారాంపూర్‌లో ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రాజమణి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామసర్పంచ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని పూలమాల, శాలువాతో సన్మానించారు. భక్తుల కోసం బీవీఆర్‌ఐటీ కళాశాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నర్సాపూర్ పట్టణంలో, పోస్టాఫీసు సమీపంలోని శ్రీరామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలకు మేలు జరుగాలని భగవంతున్ని కోరుకుంటున్నానని తెలిపారు. శ్రీరామగిరి గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా తమవంతు కృషి చేస్తానన్నారు.

కౌడిపల్లిలో..
కౌడిపల్లి : ఉమ్మడి మండలంలోని రాజిపేట, రాందాస్‌పల్లితో పాటు తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. ఆదివారం కౌడిపల్లిలోని అభయరామాలయ 26వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి జెండాను ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆవిష్కరించి, పూజలు చేశారు. మంగళపర్తి సిద్ధిరామేశ్వరస్వామితో పాటు తదితర వేద బ్రాహ్మణుల మధ్య స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దంపతులతో పాటు ఎంపీపీ పద్మానర్సింహారెడ్డి దంపతులు కల్యాణంపై కూర్చున్నారు. కల్యాణమహోత్సవానికి హరిద్వార్ (కాశీ) నుంచి అఘోరాబాబా వచ్చి భక్తులకు దర్శనమిచ్చి పలు ప్రవచనాలు తెలిపారు. భక్తులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణమహోత్సవంలో మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, ఉమ్మడి కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు హరికృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, చత్రునాయక్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూప్రాన్‌లో..
తూప్రాన్ రూరల్ : మండలంలోని కోనాయిపల్లి (పీబీ) శివారులోని రాముడి గుట్టపై సీతారాముల కల్యాణమహోత్సవ వేడుకలు చూడముచ్చటగా కొనసాగాయి. ఘనపూర్, యావాపూర్, ఇస్లాంపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, వట్టూర్, దాతర్‌పల్లి, నాగులపల్లిలో ఆలయాల్లో సీతారాముల కల్యాణమహోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తూప్రాన్ - కిష్టాపూర్ శివారులోని రామాలయం వద్ద సీతారాముల కల్యాణమహోత్సవంలో రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎఫ్‌సీఐ డైరెక్టర్ కొడిప్యాక నారాయణగుప్తా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భూపతిరెడ్డికి సన్మానం..
ఉత్సవాలకు హాజరైన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని ఎఫ్‌సీఐ డైరెక్టర్ నారాయణగుప్తా శాలువాలతో ఘనంగా సన్మానించారు.
టేక్మాల్‌లో..
టేక్మాల్ : వేల్పుగొండ శివారులోని శ్రీరామాచలం గుట్టపై సీతారాముల కల్యాణ వేడుకలు రుస్తుంపేట పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి నేతృత్వంలో జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హాజరై పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను పీఠాధిపతి శాలువాతో సన్మానించారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...