ప్రజల దాహార్తికి చలివేంద్రం


Mon,April 15, 2019 12:21 AM

సంగారెడ్డిఅర్బన్, నమస్తే తెలంగాణ: దారిన వెళ్లే బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని 65వ జాతీయ రహదారి పోలీస్‌స్టేషన్ సమీపంలో పద్మశాలీ సంఘం పాతకేరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తాగునీటిని మున్సిపల్ చైరపర్సన్ పట్నం విజయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలం రాగానే ప్రతి ఒక్కరూ నీటికోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి వారికి చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తాయన్నారు. పాతకేరి పద్మశాలి సంఘం ప్రతి ఏడాది చలివేంద్రం ఏర్పాటుచేసి ప్రజల దాహార్తి తీర్చడం మహాభాగ్యమని ఆకాక్షించారు. ఈ ఏడాది ఎండలు ముందుగానే వచ్చాయని, ఎండవేడిమి నుంచి రక్షించుకోవడానికి చల్లటి నీటితో సేద తీరవచ్చని గుర్తుచేశారు. ప్రజాసేవలో పద్మశాలీ సంఘం చలివేంద్రం ఏర్పాటుచేసి నీటిని అందించడం సంతోషకరమన్నారు. నీటితో పాటు చల్లని మజ్జిగ, అంబలి వంటి ద్రావణాలను బాటసారులకు అందించేందుకు సంఘం ముందుంటుందని ఆసంఘం అధ్యక్షుడు చిల్వేరి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్లు చింతాగోపాల్, జయరామ్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు సుధీర్‌రెడ్డి, ఎర్రోళ్ల చిన్నా, ఆత్మకూర్ నగేశ్, ఆశోక్, సంఘం సభ్యులు జనార్దన్, మాణిక్యం, పెరుమాండ్ల రాజు, కృష్ణ, పరుశురామ్, జగన్నాథం, సంగమేశ్వర్, ప్రభు, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

191
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...