రేపు పాలీసెట్ పరీక్ష


Mon,April 15, 2019 12:21 AM

మెదక్, నమస్తే తెలంగాణ: పాలిటెక్నిక్ కళాశాల 2019-20 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు గాను మంగళవారం జరిగే పరీక్షకు జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, సిద్దార్థ్ పాఠశాలలో 1400 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకు గాను పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, పరీక్షల రీజినల్ కోఆర్జీనేటర్ డాక్టర్ సువర్ణలత ఆదివారం విలేకరులకు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి గంటముందే అనుమతి ఉంటుందని, విద్యార్థులు హాల్‌టిక్కెట్లు, హెచ్‌బీ పెన్సిల్, పెన్ను వెంట తెచ్చుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి ఉండదని పేర్కొన్నారు. తొలిసారిగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని సువర్ణలత తెలిపారు. పరీక్షలకు 5గురు అబ్జర్వర్లతో పాటు ప్రత్యేక అబ్జర్వర్, 15 మంది ఇన్విజిలేటర్ల నియమించినట్లు పేర్కొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...