స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ


Mon,April 15, 2019 12:21 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
తూప్రాన్ రూరల్ : త్వరలో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు టీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్తప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వేమారెడ్డి, సంతోష్‌రెడ్డి, హరీందర్‌రెడ్డి, అక్కంగారి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు నగరంలోని కొత్తప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి ముందస్తు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడిన తరహాలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలు నిరంతరం శ్రమించాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలకే వెన్నెముకలని, కార్యకర్తలు శ్రమిస్తేనే ఎన్నికల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. గ్రామస్థాయిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను విజయ పథంలో ముందుకు నడిపించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గూడూరి రాజాగౌడ్, సిద్దిరాములుయాదవ్, గుడ్లశ్రీనివాస్, గుడ్లనగేశ్, చీమల భిక్షపతి, రవి, యాదిరెడ్డి, కావేరిగారి శ్రీనివాస్‌రెడ్డి, కేశవగారి యాదిరెడ్డి, డాకూరిఎల్లారెడ్డి, సురేశ్, దర్శన్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్, కరుణాకర్‌గౌడ్, కృష్ణాగౌడ్‌తో పాటు పలువురు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...