స్థానికంలో సత్తా చాటుతాం


Mon,April 15, 2019 12:20 AM

-16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటాం
-కనుమరుగైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
-రామాయంపేటలో రాములవారిని
-దర్శించుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేటలోని సీతారాముల కల్యాణానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాండు చెర్వు కట్టవద్దనున్న దత్తాత్రేయ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేపట్టి విలేకరులతో మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టులాంటివని అన్నారు. ఆ ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, ఇక కమలం గుర్తు కని పించకుండా పోవడం ఖాయమైపోయిందన్నారు. ప్రస్తుతం స్థానికంలో టీఆర్‌ఎస్ పార్టీ సత్తానుచాటుతామని అన్నారు. తెలంగాణ మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఫలాలు నచ్చే ప్రజలు టీఆర్‌ఎస్ కేసీఆర్ వెంట నడుస్తున్నారన్నారు. వచ్చే నాలుగున్నరేండ్లు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడలేని అభివృద్ధిని సాధించామని అన్నారు. వేల కోట్ల రూపాయలతో రోడ్లు, వివిధ అభివృద్ధి పనులను చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, పుట్టి యాదగిరి, అందె కొండల్‌రెడ్డి, బిజ్జ సపత్, ప్రభావతి, సంగు స్వామి, దేవాలయ కమిటీ చైర్మన్ చంద్రపు కొండల్‌రెడ్డి, నక్క సిద్దిరాములు, పటేరి రాము, ప్రభాకర్, నవాత్ సురేశ్, నవాత్ కిరణ్, నవీన్, సుధాకర్ ఉన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...