నేడు ఎమ్మెల్సీగా శేరి సభాష్‌రెడ్డి ప్రమాణ స్వీకారం


Mon,April 15, 2019 12:20 AM

మెదక్ ప్రతినిధి,నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లా నుంచి ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన శేరి సుభాష్‌రెడ్డి సోమవారం శాసన మండలిలోని జూబ్లీహాల్‌లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా శేరి సభాష్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జూబ్లీహాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. మెదక్ జిల్లా హవేళిఘణపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన శేరి సుభాష్‌రెడ్డి టీఆర్‌స్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మెదక్ ఉమ్మడి మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శిగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా శేరి సభాష్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీ వల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా శేరి సుభాష్‌రెడ్డి గెలుపొందారు. సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ వెంట ఉండి ఉద్యమబాట పట్టారు.

మెదక్ ఉమ్మడి మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పార్టీ పదవులు నిర్వహించారు. మెదక్ నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి కరుణం రామచందర్‌రావు మృతి చెందడంతో టీఆర్‌ఎస్ పార్టీకి మొట్ట మొదటి మెదక్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో శేరి సుభాష్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించి అప్పటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యారు. జిల్లా, మండల పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. 2011లో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శిగా నియామకమయ్యారు. 2016లో జులై నెలలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ సుభాష్‌రెడ్డిని నియమించారు. నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శేరి సభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సందర్భంలో ఉమ్మడి జిల్లా మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేంవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, క్రాంతికిరణ్, గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు సుభాష్‌రెడ్డిని బలపరిచిన వారిలో ఉన్నారు. శేరి సుభాష్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...