విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగాలి


Sun,April 14, 2019 01:10 AM

రామాయంపేట : ఆవాసంలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగాలని గోవ ఆర్మీ పోలీస్ ఎస్‌ఐలు ఎం.మయూర్, బందేకర్, నీలేశ్, నాయక్, దినేష్ గవాజ్, రామాయంపేట ఎస్‌ఐ.మహేందర్‌లు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలోని వివేకానంద ఆవాస విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గోవ పోలీసులు తమ ఉధారతతో నోటుబుక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రామాయంపేట ఎస్‌ఐ.మహేందర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం గోవ రాష్ట్రం నుంచి రామాయంపేటకు విచ్చేసిన ఆర్మీ పోలీసులు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థుల క్రమశిక్షణను చూసి వారికి తమవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నోటుబుక్కులను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థుల క్రమశిక్షణకు ముగ్ధులైన ఆర్మీ పోలీసులు మానవత్వాన్ని చాటి నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం మంచి పరిణామమన్నారు. ఎక్కడి నుంచో భద్రత కోసం విచ్చేసిన పోలీసులు శాఖ రామాయంపేట విద్యార్థులకు తమ సొంతంగా సహాయం చేయడం గొప్పతనమని అన్నారు. కార్యక్రమంలో పడకంటి సంగమేశ్వర్ తదితరలున్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...