రాములోరి కల్యాణానికి ఆలయాలు ముస్తాబు


Sat,April 13, 2019 02:47 AM

వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట శివారు హల్దీవాగు ఒడ్డున ఉన్న సీతారామ ఆశ్రమంలో రామనవమి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శనివారం అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. నవమి రోజుఅంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం చేపట్టనున్నారు. వెల్దుర్తితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించడానికి ఆలయాలను ముస్తాబుచేస్తున్నారు.

నేడు ఇస్లాంపూర్‌లో, రేపు తూప్రాన్‌లో
తూప్రాన్ రూరల్: తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ శివారులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవ కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

14న తూప్రాన్ శివారులో..
తూప్రాన్ పట్టణ శివారు-కిష్టాపూర్ వెళ్లేమార్గంలోని రామాలయం వద్ద సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు..

రాయిలాపూర్‌లో
రామాయంపేట: మండలంలోని రాయిలాపూర్, కోనాపూర్ గ్రామాలలో సీతారామచంద్రస్వామి ఆలయాలు ఉత్సవాలకు ముస్తాబైన్నాయి. 13,14,వ తేదీన జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరుకానున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...