దివ్యాంగులు పేర్లు నమోదు చేసుకోవాలి


Sat,April 13, 2019 02:47 AM

నర్సాపూర్,నమస్తే తెలంగాణ: వికలాంగులు తమ పేర్లను వికలాంగుల పునరావాస కేంద్రంలో నమోదు చేసుకోవాలని ఏపీడీ భూమయ్య తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని వికాసం కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భూమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న శారీరక మూగ, చెవిటి, మానసిక వికలాంగులు స్థానిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పేర్లను నమోదు చేసుకుని రెగ్యులర్‌గా వికాస కేంద్రానికి రావాలన్నారు. అలా రావడంతో వారి ప్రస్తుత స్థితిలో మార్పు రావడంతో పాటు మాములు వ్యక్తులుగా మారే అవకాశం ఉన్నదని తెలిపారు. తల్లిదండ్రులు, బంధువులు వికలాంగుల పునరావాస కేంద్రానికి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీపీఎం మోహన్, ఏపీఎం గౌరిశంకర్, సీసీ సమత, ఫ్రోఫెషనల్‌లు సుభాష్, సంతోష్, ఆక్టివిస్ట్ సుజాత, సీఆర్‌పీ జ్యోతి, ఆయా కమలమ్మ, కమిటీ సభ్యులు హేమలత, నవనీత, సుగుణ, బాలమణి తదితరులు ఉన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...