పంచాయతీ కార్యదర్శుల నియామకం


Sat,April 13, 2019 02:46 AM

రామాయంపేట: రామాయంపేట ఉమ్మడి మండలానికి పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు రామాయంపేట ఇన్‌చార్జి ఎంపీడీవో రత్నాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న కార్యదర్శులు అధికారికి జాయినింగ్ లెటర్ అందజేశారు. రామాయంపేట, నిజాంపేట మండలాలకు గానూ మొత్తం 17 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీలున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 12 మంది కిషన్‌తండాకు శ్యామల, సుతారిపల్లికి పద్మ, రాంపూర్‌కు కవిత, తొనిగండ్లకు అనిత, నగరం తండాకు మాధవి, శివ్వాయపల్లెకు రమేశ్‌గౌడ్‌లు కార్యదర్శులుగా నేడు నియామకమవుతున్నారని తెలిపారు. మిగతా వారు కూడా త్వరలోనే నియామక కానున్నారన్నారు. నూతనంగా వచ్చిన కార్యదర్శులు శనివారం రెండు మండలాల్లోని వారికి కేటాయించిన గ్రామపంచాయతీలకు వెళ్లి విధుల్లో చేరుతారని తెలిపారు.

వట్టూర్,దాతర్‌పల్లిలకు..
తూప్రాన్ రూరల్: తూప్రాన్ మండలం దాతర్‌పల్లి, వట్టూర్ గ్రా మ పంచాయతీలకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నియమితులయ్యారు. దాతర్‌పల్లి నూత న జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఆర్,సంగమేశ్వర్, వట్టూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా బి సుధాకర్ నియమితులయ్యారు. కాగా ఇద్దరూ కార్యదర్శులు శుక్రవారం సాయంత్రం తూప్రాన్ ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అశోక్‌కుమార్‌కు జాయినింగ్ రిపోర్ట్ చేశారు.

214
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...