ఘనంగా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు


Fri,April 12, 2019 12:27 AM

హవేళిఘణపూర్: మండల కేంద్రమైన హవేళిఘణపూర్ మహాత్మాజ్యోతిబాపూలె 191 జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంతోషి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా జ్యోతిరావుపూలె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్ సంతోషి, ఉపాధ్యాయ బృందం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ స్వప్న విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

రామాయంపేట: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదల పెన్నిది అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుబడిన జ్యోతిరావు పూలేను ఎవ్వరు కూడా మరు వద్దని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం,ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల కిషన్ పేర్కొన్నారు. గురువారం రామాయంపేటలో జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో కులవివక్షతను వ్యతిరేకించిన మహానుభావుడు జోతిరావు పూలేనని అన్నారు.దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అనంతరం అక్కన్నపేట గ్రామంలో కూడా నివాళులర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మసాయిపేట మల్లెశం,లద్ద నర్సింహులు,సార్గు శ్రీనివాస్,పుట్టి యాదగిరి,సరాఫ్ యాదగిరి,పల్లె జితెందర్‌గౌడ్ తదితరులున్నారు.

బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో..
రామాయంపేట పట్టణంలోని బజరంగ్‌దళ అధ్వర్యంలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో జ్యోతారావు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమంలో జిల్లా సంఘటన ప్రధాన కార్యదర్శి పుట్టి మల్లేశం, భాణుచెందర్, రమేశ్, ప్రసాద్, వెంకటి,సతీశ్, శ్రీనివాస్ తదితరులున్నారు.

మెదక్ మున్సిపాలిటీ : మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని రాందాస్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అట్టడుగు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సాధన సమితి అధ్యక్షుడు సుభాష్‌గౌడ్ మాట్లాడుతూ జ్యోతిబాపూలే జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశ మూలవాసి, సామాజిక న్యాయం కోసం ఉద్యమించి స్వేచ్ఛా సమానత్వ సాధనకై సామాజిక కుల నిర్మూలన, కుల రహిత సమాజం కోసం అంటరాని కులాలను నిర్మూలించడానికి మహిళల హక్కుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిబాపూలే అని అన్నారు. దళిత బహుజనులు ఏకతాటిగా వచ్చి రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బాల్‌రాజ్‌మాదిగ మాట్లాడుతూ పేదల పెన్నిది జ్యోతిబాపూలే దేశ మొట మొదటి చదువుల తల్లి సావిత్రిబాయిపూలే అని గుర్తు చేశారు. కార్యక్రమంలో దళిత సామాజిక, బీసీ ప్రజాసంఘం నాయకులు యాదగిరి, కుమార్, బాబు, వెంకటేశం, నందారెడ్డి, రామస్వామి, దేవయ్య, పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...