జిల్లాలో భానుడి ప్రతాపం


Fri,April 12, 2019 12:26 AM

- రోజురోజుకూ పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 43.6 డిగ్రీలు

మెదక్, నమస్తే తెలంగాణ: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకు కలిగిస్తుంది. గత ఐదు రోజులుగా జిల్లాలో 41 డిగ్రీలను మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. గురువారం జిల్లాలో అత్యధికంగా 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంది. ఈ యేడు ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. గత సంవత్సరం ఇదే రోజున జిల్లాలో 37.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ 10 గంటలకే భగభగ మంటున్నాడు. ఏప్రిలోనే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో అంటూ జనాలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఎండ ప్రభావం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ నుంచి జాగ్రతలు తీసుకోవాలని, అత్యంత అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బాటసారులకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.

నమోదైన ఉష్ణోగ్రతలు
నర్సాపూర్ 43.6
వెల్దుర్తి 42.8
హవేళి ఘనపూర్(నాగపూర్) 42.7
నర్సాపూర్(చిప్పల్‌తుర్తి) 42.4
టేక్మాల్(బోడగేట్) 41.9
పాపన్నపేట(మిన్‌పూర్) 41.8

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...