గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలి


Thu,April 11, 2019 12:14 AM

తూప్రాన్ రూరల్: మారుమూల గ్రా మీణ ప్రాంతాలు, ప ట్టణాలను హరితవనాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ జీఎస్ అడీషన్ ప్రా జెక్టు డైరెక్టర్ (ఏపీడీ) విజయ అన్నారు. తూప్రాన్ ఐకేపీ కా ర్యాలయంలో బుధవారం మండలంలో ని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనుల వివరాలు సిబ్బంది నుం చి ఆమె అడిగి తెలుసుకున్నారు.చెరువులు, కుంటల్లో జరుగుతున్న పనులు ఎంత వరకు పూర్తికావచ్చాయి..? ఏయే గ్రామాల్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి..? ఎంత మంది కూలీలు పాల్గొంటున్నారు..? ఉపాధి పనులకు వచ్చే కూలీలకు కల్పిస్తున్న మౌలిక వసతులు..? తాగునీరు, ఫస్ట్ ఏయిడ్‌కిట్‌ల ఏర్పాటు..?తదితర అంశాలను గ్రామాల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్‌ల నుంచి అడిగి తెలుసుకున్నారు.

అయితే ఉపాధిహామీ పనులకు కూ లీలు అధికంగా వచ్చేవిధంగా కృషి చేయాలన్నారు. దీంతో పాటే గ్రామాల్లో పెంపకం చేపడుతున్న నర్సరీల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన నీటిని అందించి వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భూములు, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. హరితహారం కింద ఏయే ప్రాంతాల్లో మొక్కలు నాటుతారో వాటి వివరాలు ముందుగానే గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి హరితవనాలుగా తీర్చిదిద్దడంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు తగిన చొరవ చూపించాలన్నారు. ఈజీఎస్ ఏపీవో కృష్ణారెడ్డితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...