సంక్షేమానికి పట్టం కట్టండి


Wed,April 10, 2019 12:17 AM

రేగోడ్: ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించి జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్‌ను గెలిపించాలని జిల్లా జాగృతి అధ్యక్షురాలు మల్లిక కోరారు. మండల కేంద్రంలో మంగళవారం ఆమె టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేంద్రంలో కూడా తెలంగాణ కీలకం కావాలంటే కచ్చితంగా 16 మంది ఎంపీలను గెలిపించుకోవలసిందేనన్నారు. ఎంపీగా బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధే ధ్యేయంగా పని చేశారని గుర్తు చేశారు. మళ్ళీ బీబీ పాటిల్‌ను గెలిపించుకుంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాను దక్కించుకుని రైతుల కలను నెరవేర్చుకోవచ్చని తెలిపారు.

టీఆర్‌ఎస్ ముమ్మర ప్రచారం......
రేగోడ్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంతో పాటు ఉపాధి కూలీలను కలుసుకుని ప్రభుత్వ పథకాల అమలు, టీఆర్‌ఎస్ జనరంజక పాలనపై వివరించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నరెందర్, కోఆప్షన్ సభ్యుడు మొహీజొద్దీన్, సర్పంచ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాలకృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఫాజిల్ నాయకులు రాజ్‌కమల్, రాధాకిషన్‌గుప్త, నర్సింలు, సుభాష్, సల్మాన్ పాల్గొన్నారు.

బీబీపాటిల్‌ను భారీ మెజార్టీతో
గెలిపించుకోవాలి : జాగృతి జిల్లా అధ్యక్షురాలు మల్లిక
అల్లాదుర్గం: జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ను భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు మల్లిక పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని చేవెళ్లలో టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీబీపాటిల్‌ను గెలిపించాలని కోరారు. వస్తుందన్నారు.కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రశేఖర్,టీఆర్‌ఎస్ నాయకులు జస్వరాజ్, వీరన్న, సంటప్ప, పద్మ, పాల్గొన్నారు.

సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిట్కుల మహిపాల్‌రెడ్డి
మనోహరాబాద్ : టీఆర్‌ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిట్కుల మహిపాల్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో మంగళవారంమహిళలు, నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి దేశ చరిత్రలోనే కొత్త ప్రభాకర్‌రెడ్డిని 5 లక్షల మెజార్టీకిపైగా ఓట్లతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ బిడ్డగా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలన్నారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లతవెంకటేశ్‌గౌడ్, కో ఆప్షన్ మెంబర్ జావీద్, నాయకులు తప్పెటి శ్రీనివాస్, యాదగిరిగౌడ్, దశరథ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...