నేను సిద్దిపేటకు పాత వాడినే..


Wed,April 10, 2019 12:16 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : నేను సిద్దిపేటకు కొత్తవాన్ని కాదు.. పాత వాన్నే.. మీలో ఒకడిగా ఉన్నా.. ఆశీర్వదించండి అంటూ టీఆర్‌ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఉదయం మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలోని కోమటి చెరువు, హైస్కూల్, డిగ్రీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకింగ్ చేశారు. వాకింగ్ చేస్తూ వాకర్స్‌తో ముచ్చటించారు. సిద్దిపేటలో నేను చదువుకున్న.. మీ మధ్యలోనే పెరిగిన.. అంటూ అక్కడున్న కొంత మంది పాత మిత్రులను కలిసి ఆత్మీయతను పంచుకున్నారు. వాకింగ్ చేస్తున్నంత సేపు సీనియర్ సిటిజన్స్, యువకులు, ప్రజలతో ముచ్చటించారు. హరీశ్‌రావు అభివృద్ధికి తోడుగా ఉంటూ మీ అభిమానానికి రుణపడి ఉంటా.. నిరంతరం మీకు సేవ చేస్తా.. మరోసారి మీ ముందుకు వచ్చానని నన్ను ఆశీర్వదించాలని కోరారు. మీరు గతంలో పాసుపోస్టు దరఖాస్తు చేసుకోవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి ఉండేది. ఈ ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని సిద్దిపేట పాసుపోర్టు కేంద్రం ఏర్పాటు చేశా. పిల్లలకు మంచి చదువు కోసం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసుకున్నాం. సిద్దిపేటకు రైలు తేవాలన్న కళ కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది.

రైల్వేలైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సిద్దిపేట మరింత అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్యే హరీశ్‌రావును ఎలా ఆదరించారో నన్ను అలానే ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్‌లో చదువుతున్న పాత మిత్రులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. హైస్కూల్ గ్రౌండ్‌లో కాసేపు క్రికెట్ ఆడారు. సిద్దిపేట జయశంకర్ స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేసి సేదతీరారు. ఎంపీ వెంట కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, నాయకులు ధర్మవరం బ్రహ్మం, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, రాందాస్‌గౌడ్, గ్యాదరి కుమార్, పలువురు ఉన్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...