ఈడీసీ ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు


Wed,April 10, 2019 12:16 AM

తూప్రాన్ రూరల్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ) పొందిన ఉద్యోగులు, పోస్టల్ బ్యాలెట్ కోరుకున్న ఉద్యోగులు 5,565 మంది ఉన్నట్లు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల జిల్లా నోడల్ ఆఫీసర్, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ పేర్కొన్నారు. తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ..పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎ న్నికల డ్యూటీలు ఎక్కడ వేసినా ఈడీసీ సర్టిఫికెట్ పొందిన సదరు ఉద్యోగి ఈవీఎంలలోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిగణలోకి తీసుకుంటే మెదక్‌లో 716 మంది, నర్సాపూర్‌లో 323 మంది, గజ్వేల్‌లో 486 మంది, సిద్దిపేటలో 1,379 మంది, దుబ్బాకలో 390 మంది,సంగారెడ్డిలో 562 మంది,పటాన్‌చెరులో 129 మంది ఈడీసీని పొందినట్లు చెప్పా రు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కోరుకున్న వారీలో అ సెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెదక్‌లో 92 మంది, నర్సాపూర్‌లో 45 మంది,గజ్వేల్‌లో 249 మంది,సిద్దిపేటలో 280 మంది,దుబ్బాకలో 111 మంది,సంగారెడ్డిలో 689 మంది,పటాన్‌చెరులో 114 మంది ఉన్నారన్నారు.ఈడీసీని పొంది న ఉద్యోగులు 3,985 మంది, పోస్టల్ బ్యాలెట్ కోరుకున్న వారు 1,5 80 మంది ఉన్నట్లు చె ప్పారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిక ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న వారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌లు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...