రికార్డు బ్రేక్ కావాలి


Tue,April 9, 2019 01:28 AM

-దేశం మొత్తం సిద్దిపేట వైపు చూడాలి
-సీఎం కేసీఆర్ దీవెనతో అభివృద్ధి
-చేసిన పనిని చెప్పి.. ఓటు అడగండి
-మూడు రోజులు కష్టపడండి.. వచ్చే ఐదేండ్లు జోడెడ్లలా పనిచేస్తాం..
-కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వృథానే..
-టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలుస్తుంది
-త్వరలోనే లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు
-టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
-మీ కష్టసుఖాల్లో తోడుంటా : ఎంపీ అభ్యర్థి కేపీఆర్
-సిద్దిపేటలో భారీ రోడ్‌షో.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం
సిద్దిపేట ప్రతినిధి/కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ దీవెనతో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా.. చేసిన అభివృద్ధిని చెప్పండి.. గడపగడపకూ వెళ్లండి.. ప్రతి గుండెను కదిలించండి.. ఈ రెండు రోజులు కష్టపడి పనిచేయండి.. వచ్చే ఐదేండ్లు జోడెడ్లలాగా పనిచేస్తాం.. నిండు మనసుతో ఆశీర్వదించండి.. దేశంలోనే మెదక్ మెజార్టీ అగ్రస్థానంలో ఉం డాలి.. యావత్తు దేశం సిద్దిపేట వైపు చూడాలని టీఆర్‌ఎస్‌స్టార్ క్యాంపెయినర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట పట్టణంలో రెండున్నర గంటల పాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డిలతో కలిసి భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పసిపిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ అడిగినా సార్ కేసీఆర్ అంటున్రు.. కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తుండు.. మెజార్టీలో గజ్వేల్, నర్సాపూర్, దుబ్బాక, మెదక్, పటాన్‌చెరు నియోజకవర్గాలు సిద్దిపేటతో పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతో పీవీ నర్సింహారావు, నరేంద్రమోడీ, జగన్‌మోహన్‌రెడ్డిల రికార్డులు బద్దలు కావాలి. అభివృద్ధి అయినా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిలేవైనా మెజార్టీలో సిద్దిపేట నంబర్ వన్ చాటాలి. అమేథి, వారణాసీల గురించి కాకుండా యావత్తు దేశం మెదక్ పార్లమెంట్ గురించే మాట్లాడాలి. సిద్దిపేట పాసుపోర్టు సేవా కేంద్రం, కేంద్రీయ విద్యాలయం, రెండు జాతీయ రహదారులు, రైల్వేలైన్ నిర్మాణంలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషి ఉంది. మరో సంవత్సరన్నరలో సిద్దిపేటకు రైలు తీసుకువస్తాం. గతంలో ఎంపీలంటే ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడే కనబడేవారు. కానీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కష్టమైన, సుఖమైన, పండుగైన మనతోనే కలిసున్నడు. ప్రతి కార్యకర్త పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి. పోలింగ్ శాతం పెరిగితేనే మెజార్టీ పెరుగుతుంది. కాం గ్రెస్, బీజేపీలకు ఓట్లు పడవు. వేసే ప్రతి ఓటు టీఆర్‌ఎస్‌కే పడాలి. రైతుబజారు, కోమటి చెరువు, సమీకృత మార్కెట్‌లను చూసి ఓటేయమని ప్రజలను అడగండి. సిద్దిపేటను జిల్లా చేసుకున్నాం. మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకొని ఉన్నత వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చాం. సిద్దిపేట ఇవాళ రాష్ర్టానికి ఒక అధ్యాయన కేంద్రంగా తయారు చేశాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూడడానికి వస్తున్నారు. దసరా పండుగ నాటికి లక్షా 10 వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరందిస్తాం. అభివృద్ధి పరంపర కొనసాగాలంటే టీఆర్‌ఎస్ పార్టీని బలపర్చాలన్నారు.

16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుంది
రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలుస్తున్నాం.. ఢిల్లీయే మన దగ్గరికి వచ్చి దం డం పెడుతారు. అదే కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాహుల్, మోడీకి లాభం జరుగుతుందన్నారు. అదే టీఆర్‌ఎస్‌ఎంపీలకు వేస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. రాహుల్‌గాంధీ ఆం ధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుండు. తెలంగాణ విభజన హామీల అమలుపై మాట్లాడడం లేదు. నరేంద్రమోడీ గుజరాత్‌కు బుల్లెట్ రైలును, మహారాష్ట్రకు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు.

మీ కష్టసుఖాల్లో ఉంటా :టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
రెండోసారి పోటీ చేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. నిండు మనసుతో దీవించి ఆశీర్వదించండి. ఈ రెండు రోజులు నా కోసం పనిచేయండి. వచ్చే ఐదేండ్లు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎన్ని జన్మలెత్తిన సిద్దిపేట ప్రజలు చూపిన ప్రేమ మరువలేనిదని, సిద్దిపేటను దేశంలోనే అగ్రగామిగా ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలిపారన్నారు. కేంద్రం నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జడ్పీటీసీ వజ్రవ్వ యాదగిరి, వైస్ ఎంపీపీ శ్రీహరిగౌడ్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, ఉమారాణి శ్రీనివాస్, జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయ, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాల్‌రంగం, నాయకులు శ్రీనివాస్‌రావు, పూజల వెంకటేశ్వర్‌రావు, నాయకం లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, రవి, బ్రహ్మం, నర్సింలు తదితర నాయకులతో పాటు సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...