జోరుగా టీఆర్‌ఎస్ ప్రచారం


Tue,April 9, 2019 01:26 AM

మెదక్, నమస్తే తెలంగాణ : మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మాజీ మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, చల్ల నరేందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 25, 26వ వార్డుల్లో ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు ఆర్కె శ్రీనివాస్, రబ్బీ, యశోధ, చంద్రకళ,లక్ష్మి, జ్యోతి, మాజీ కౌన్సిలర్లు మంగ రమేశ్‌గౌడ్, చింతల నర్సింహులు, గౌష్‌ఖురేషి. చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు లింగారెడ్డి, ఏనుగుల రాజు, జీవన్‌రావు, ఉమర్, గోవింద్, గోదల కృష్ణ, మోచి కిషన్, బాలరాజు, అడివయ్య, మహమ్మద్, ప్రసాద్, రవి, సిద్ధిరాములు, పాల్గొన్నారు.

మండలంలోని పాతూర్, శివ్వాయిపల్లి, రాజ్‌పల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్ నాయకులు కిష్టయ్య, కంఠప్పగారి శ్రీనివాస్, సుధాకర్‌ల ఆధ్యర్యంలో సోమవారం టీఆర్‌ఎస్ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. . ప్రచారంలో మండల పార్టీ నాయకులు కిష్టయ్య, రాములు, మార్గం శ్రీనివాస్, ప్రభాకర్, యాదగిరి, సాయిలు, రవి, రాజు, పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.మెదక్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర టీఆర్‌ఎస్ మండలఅధ్యక్షుడు పట్లోరి రాజు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, ఎంపీటీసీ శ్రీను, సర్పంచ్‌లు పూలపల్లి యాదగిరి యాదవ్, సిద్ధిరాంరెడ్డి, నాయకులు మనోజ్‌కుమార్, తిరుపతిరెడ్డి, లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

హవేళిఘణపూర్‌లో..
హవేళిఘణపూర్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని చౌట్లపల్లి, మద్దుల్‌వాయి, ముత్తాయికోట, లింగ్సాన్‌పల్లి, హవేళిఘనపూర్‌ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిరణ్‌గౌడ్, శర్వయ్య,టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు

బీబీపాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
టేక్మాల్: జహీరాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపే ధ్యేయంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని కోరంపల్లి, బోడగట్టు, వేల్పుగొండ, ఎల్లుపేట, సూరంపల్లి, మల్కాపూర్, ఎక్లాస్‌పూర్ తదితర గ్రామాల్లో సోమవారం టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేసి కారుగుర్తుకు ఓటు వేసి బీబీ పాటిల్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. సీనియర్ జిల్లా నాయకులు వీరప్ప, టేక్మాల్ ఎంపీటీసీ సిద్ధయ్య ఆధ్వర్యంలో కోరంపల్లి, బోడగట్టు, వేల్పుగొండ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశా రు. ఈ కార్యక్రమంలో శ్రీధర్‌రెడ్డి, కోరంపల్లి సర్పంచ్ శ్రీనివాస్, విఠల్, రాంరెడ్డి, భూమయ్య, మల్లేషం, గంగారం, దుర్గయ్య ఉన్నారు.
ఎల్లుపేటలో...
మండల పరిధిలోని ఎల్లుపేట, వేల్పుగొండ, షాబాద్ గ్రామాల్లో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవిబాబు, శ్రీధరచారి, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు, సత్యం, యోగి, శంకర్, గణేశ్ ఉన్నారు.

బోడగట్టులో...
బోడగట్టు గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నిక లో కారుగుర్తుకు ఓటు వేసి ఎంపీగా బీబీపాటిల్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శశిధర్‌రెడ్డి, నారాయణ, వెంకట్‌గౌడ్, మల్లేశం ఉన్నారు. ఎక్లాస్‌పూర్ గ్రామంలో సర్పంచ్ దుర్గయ్య, ఉపసర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అల్లాదుర్గంలో..
అల్లాదుర్గం:సీఎం కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుభాశ్‌రావు,వట్‌పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లెగడ్డ నర్సింహులు అన్నారు. జహీరాబాద్ పార్టమెంట్ అభ్యర్థి బీబీపాటిల్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ సోమవారం మండల పరిధిలోని ముప్పారం, బహిరన్‌దిబ్బ, కాయిదంపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు బేతయ్య, మల్లేశం, సుభాశ్, ఎంపీటీసీలు చంద్రశేఖర్, గోపాల్, మాజీ సర్పంచులు చెన్నప్ప, ప్రకాశ్, పాల్గొన్నారు.

రేగోడ్‌లో..
రేగోడ్: జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఫైయల్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు నాగన్న, కోహీర్ స్వామి పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...