ఢిల్లీనీ శాసీద్దాం..


Tue,March 26, 2019 12:03 AM

రాయపోల్ : రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలను టీఆర్‌ఎస్ నుంచి గెలిపిస్తే ఢిల్లీ మన చేతుల్లో ఉంటుందని. మనమే నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తామని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం టీఆర్‌ఎస్ రాయపోల్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లలోనే 70 ఏండ్ల అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఈ సారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదని, ప్రజల్లో ఆ పార్టీలకు విశ్వాసం లేదన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మారుమూల పల్లె ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణలో 16ఎంపీ స్థానాలు గెలిపించుకుంటే ఢిల్లీలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించడంతో పాటు రాష్ర్టాన్నికి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఆలోచించి టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

గెలిపించండి అభివృద్ధి చేస్తా.. : టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలుపొందితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్, బీజేపీల పాలనపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు.

ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు.. : ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఢిల్లీని శాసించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు మెజార్టీ ఇచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయలన్నారు.

భారీ మెజార్టీతో గెలిపించాలి..: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేదంర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదని ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు మామిడి మోహన్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, దేవి రవీందర్, ఎంపీపీ అధ్యక్షురాలు అబ్బగౌని మంగమ్మ, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు రణం శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర శర్మ, మండల నాయకులు రాజిరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...