16 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యం


Tue,March 26, 2019 12:02 AM

అల్లాదుర్గం : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిరక్ష్య వైఖరిని అవలంభిస్తుందని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఏప్రిల్ 3న అల్లాదుర్గంలో నిర్వహించనున్న బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్య వైఖరిని రూపుమాపాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందాలన్నారు. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఇదే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నాలుగున్నర ఏండ్లు ప్రధాన మోదీని అడిగితే పట్టించుకోకుండా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాదా, ఎందుకు కాళేశ్వరానికి నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. కేంద్రంలో సీఎం కేసీఆర్ మాట నెగ్గేలా 16ఎంపీ స్థానాలో గెలిచి తెలంగాణ సత్తా చాటాలన్నారు. ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకర్గ ఎన్నికల సభను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. 7 నియోజకవర్గాల నుంచి 2లక్షల మంది జనసమీకరణ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. సమావేశంలో అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, జుక్కల్, కామారెడ్డి ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, హన్‌మంత్ షిండే, గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి భరత్ కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు భిక్షపతి, జోగిపేట ఏఎమ్‌సీ చైర్మన్ నాగభూషణం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుభాశ్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు కాశీనాథ్, బలరాం, నారాయణ, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...