ఏడుపాయల తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం


Tue,March 26, 2019 12:02 AM

కౌడిపల్లి: ఏడుపాయల జాతర తరహాలో తునికి నల్లపోచమ్మ జాతర సైతం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. జాతరకు హాజరైన ఎమ్మెల్యేకు ఆలయకార్యనిర్వాహణ అధికారి సార శ్రీనివాస్ ఘనంగా శాలువాతో సత్కరించారు. అలాగే నల్లపోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు ఆలయాలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడుపాయల జాతరకు ప్రతి ఏటా కోటి రూ. బడ్జెట్‌ను కేటాయించడం, ప్రభుత్వమే అధికారికంగా పట్టువస్ర్తాలను సమర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే క్రమంలో తునికి నల్లపోచమ్మ ఉత్సవాలకు సైతం ప్రతి యేటా నిధులు మంజూరు జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. నల్లపోచమ్మ కరుణతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు త్వరగా చేరి, వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అలాగే కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేసి రైతులకు అందించాలని అమ్మవారిని ఎమ్మెల్యే కోరినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాలేరు శివాంజనేయులు, రైతు సమన్వయ మండల కన్వీనర్ సార రామాగౌడ్ పాల్గొన్నారు.

భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాలు, బోనాలు, కోడిపుంజులు, తదితర మొక్కులను చెల్లుంచుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ సభ్యులతో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. సీఐ సైదులు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును నిర్వహించారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...