పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి


Tue,March 26, 2019 12:02 AM

- ఎంపీడీవోలకు సీఈవో రవి ఆదేశం
సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు జడ్పీ సీఈవో టి.రవి సూచించారు. సోమవా రం ఉమ్మడి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో ఉమ్మడి జిల్లాలలో పనిచేస్తున్న ఎంపీడీవోల శిక్షణ శిబిరం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేయగానే జడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు. ముందుగా గ్రామాలలో వచ్చేనెల 7న ఓటరు జాబితాను ప్రకటించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు జాగ్రతలు తీసుకుని పరిషత్ ఎన్నికలకు సిద్ధంకావాలని, బూత్‌ల ఏర్పాట్లు ఓటర్లకు అనుగుణంగా సిద్ధం చేయాలన్నారు. 600 ఓట్లకు ఒక బూత్‌ను ఏర్పాటుచేయాలని ఎంపీడీవోలకు మార్గనిర్దే శం చేశారు. ప్రకటన రాగానే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లలో అధికారు లు నిమగ్నం కావాలన్నారు. 3 ఎంపీటీసీలకు ఒక రిటర్నింగు అధికారి ఉంటారని, వారికి అధికారులు సహరించాలన్నారు. అధికారులు కౌంటిం గ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల కేంద్రాలను గుర్తించి పర్యవేక్షించాలన్నా రు. నామినేషన్లు సంబంధిత మండల కేంద్రాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు సమర్పించే విధంగా అధికారులు ముందుగా అవగాహన క ల్పించాలన్నారు. రిటర్నింగు అధికారికి ఎంపీడీవోలు సహకరించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సీఈవో కోరారు. కార్యక్రమంలో డి ప్యూటీ సీఈవో విజయలక్ష్మి, పర్యవేక్షకులు రంగాచార్యులు, మనోజ్‌కమా ర్, నర్సింహులు, సిబ్బంది వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా ఎంపీడీవోలు, ఈ వోపీఆర్డీలు, సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...