నేటితో నామినేషన్ల గడువు పూర్తి..


Mon,March 25, 2019 12:17 AM

సంగారెడ్డి చౌరస్తా : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్నది. ఇప్పటివరకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా ప్రధాన పార్టీల అభ్యర్థులు టీఆర్‌ఎస్ నుంచి బీబీ పాటిల్ రెండు సెట్లు, కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్‌రావు 2 సెట్లు దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థి భట్టు రాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రవీణ్‌కుమార్, ముదిరాజ్ వెంకటేశంలు ఒక్కో నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 8సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన మొదలైన నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనున్నది. మొదటి రెండు రోజులు 18, 19వ తేదీల్లో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. మూడో రోజు 20వ తేదీన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 21న హోలీ పండుగను పురస్కరించుకుని సెలవు దినం కావడంతో నామినేషన్లకు బ్రేక్‌పడిన విషయం తెలిసిందే. నాలుగో రోజూ నామినేషన్ల స్వీకరణలో భాగంగా అత్యధికంగా నలుగురు అభ్యర్థులు 5 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 23న నాలుగో శనివారం (కేంద్ర ప్రభుత్వ సెలవు దినం), 24న ఆదివారం సాధారణ సెలవు రోజు కావడంతో 25న సోమవారం ఒక రోజు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు మిగిలింది. దీంతో సోమవారం పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...